top of page
DSC09122_edited.png

Dr. Vukkala
Rajashekhara Siddanthi

I am Dr. vukkala Rajashekhara siddanti , Ph.D in jyothisham, panchanga kartha, paancharaatra aagama prathishtaacharya, Krishna yajurveda adhyay, Vedic numerologist and vaastu consultant. We are providing all the spiritual information regarding astrology, numerology, Vastu shastra, Dharm Shastra and Dharma sandehalu.

Awards

About Siddanthi garu

Dr. Vukkala Rajashekhara Siddanthi

జన్మ సమయంలో నా నామము రాజగోపాలా చార్యులు తర్వాత స్కూల్ లో వుక్కల రాజశేఖర్ గాను, ఇప్పుడు డాక్టర్ వుక్కల రాజశేఖర సిద్ధాంతి అనే నేను బాల్యంలోనే మాతామహులైన శ్రీమాన్  ఖేడ  కృష్ణమాచార్యుల వద్ద పురాణోక్తంగా పౌరోహిత్యాన్ని జ్యోతిష భాగంలో ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాను తర్వాత అంగ్ల విద్యలో కొంతవరకు చదివి తర్వాత పరిస్థితుల వల్ల పౌరోహిత్యంలోకి రావడం జరిగింది ఈ పౌరోహిత్యంలో వేదోక్తంగా బ్రహ్మశ్రీ మార్చాల బాలకృష్ణ శర్మ గారి వద్ద నా ప్రాథమిక విద్యను ఆరంభించినాను. వారు నాకు ప్రథమ వేద గురువులు ఆ తర్వాత సలక్షణ ఘనాపాటి శ్రీమాన్ కామసముద్రం కొడిచర్ల పాండురంగా చార్యుల వారి వద్ద కృష్ణ యాజర్వేద అద్యయనం చేయడం తర్వాత జ్యోతిష భాగంలో పట్టు సాధించి మంచి పేరు తెచ్చుకోవడం పాంచరాత్రాగమం ప్రకారంగా ఆరాధన బ్రహ్మోత్సవం ప్రతిష్టాంతం వరకు అద్యయనం చేసి ప్రతిష్టల వరకు చేయిస్తూ కొంత ధర్మశాస్త్రాన్ని కూడా అద్యయనం చేయడం అది మనసుకు తృప్తి లేక సంఖ్యాశాస్త్రంలో కూడా నైపుణ్యాన్ని సంపాదించడం అదే కాకుండా పంచాంగ గణితాన్ని గణకానంద పద్ధతిలో మొట్టమొదులుగా నేర్చుకొని కొన్ని సంవత్సరాలు (12 సంవత్సరాలు) పంచాంగ ముద్రణ చేసి ఆ తర్వాత గణితం చేస్తూ క్యాలెండర్ మాత్రమే ముద్రణ చేసి అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ పూర్వ అపర కర్మలు, జ్యోతిష భాగం, ఫలిత భాగం, ప్రశ్న భాగం, సిద్ధాంత భాగం నా దగ్గరికి వచ్చి విద్యార్థులు ఉచితంగా చాలామంది నేర్చుకుంటున్నారు నాచే సాధ్యమైనంత నాకు తెలిసిన విషయాలను పదిమందికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నాను మిత్రుల,అభిమానుల కోరిక మేరకు చిన్నపాటి యూట్యూబ్ చానల్ కూడా శ్రీ శభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ ప్రతిపద నాడు (02-04-2022) న ఆరంభించడం జరిగింది అందరి అభిమానంతో తొందరగానే గుర్తింపు పొందింది మానిటైజేషన్ కూడా ఐపోయింది.

మార్చాల బాలకృష్ణ శర్మ గారు మా ప్రథమ గురువు గారు.jpg

బ్రహ్మశ్రీ మార్చాల బాలకృష్ణ శర్మ గారు
మా ప్రథమ గురువు గారు

WhatsApp Image 2023-09-17 at 10.18.37 AM.jpeg
WhatsApp Image 2023-09-17 at 10.17.09 AM.jpeg

మా వేద గురువుగారు శ్రీమాన్ కొడిచెర్ల పాండురంగాచార్యుల
స్వామి వారు

Whatsapp

+91 9346439394

Email

You can also contact us by using this form:

Thanks for submitting!

© 2023 by srivukkalaastro.com

bottom of page